20-20 క్రికెట్

ఇది నా తొలి బ్లాగ్. ఎప్పటినుంచో బ్లాగాలని ప్రయత్నం ఇప్పటికి బ్లాగుతున్న. తప్పులు ఉంటే చెప్పండి సరిదిద్దుకొగలను.

 

నా పరిశీలనలొ 2 పరుగులు (రన్స్) వచ్చే దగ్గర 1 పరుగు,3 పరుగులు  వచ్చే దగ్గర 2 పరుగులు వచ్చాయంటే పరుగు తీసే వాళ్ళలొ ఒకరు గంగూలీ కానీ లక్ష్మణ్ కానీ ఉన్నట్టు.

               2 పరుగులు (రన్స్) వచ్చే దగ్గర 3 పరుగులు,1 పరుగు  వచ్చే దగ్గర

2 పరుగులు వచ్చాయంటే బంతి ని ఫీల్డింగ్ చేసింది మునాఫ్ పటేల్.

నూటికి 99.999 శాతం  లెక్క తప్పదు.  

నాకు నచ్చని జట్లు

 

 డెక్కన్ ఛార్జర్స్:

 

లక్ష్మణ్ కి లేని గాయానికి కట్టు కట్టి పక్కన పెట్టిన డెక్కన్ ఛార్జర్స్ గెలవలేక పొయారు. అసలు ఒక రొజు పోటీలకే(ఒన్ డే) పనిచెయ్యడని పక్కన పెట్టిన లక్ష్మణ్ ని 20-20 జట్టు కి నాయకుడిని చెయ్యడం మొదటి తప్పు.మొదటి 2 పొటీలలొ  లక్ష్మణ్ నాయకుడొ,గిల్ క్రీస్ట్,సిమండ్స్ నాయకులొ నాకు అర్దం కాలేదు?  జట్టు లో నాకు నచ్చిన ఆటగాళ్ళు రోహిత్ శర్మ,విజయ్ కుమార్.

 

రాయల్ ఛాలెంజర్స్:

 

 బౌలర్స్ అందరిలొ అత్యంత అనవసరం ఐన వాళ్ళ ను ఎంపిక చేస్తె అందులో

మొదటి 3 లో ఉంటాడు సునీల్ జోషి అతన్ని ప్రాతిపదికన ఎంపిక చేసారో నాకు అర్ధం కాలేదు?

వెంకటేష్ ప్రసాద్,ద్రవిద్,జాఫర్,చందర్ పాల్ ఆట తర్వాత విషయం అసలు ఆడేటప్పుడు వీళ్ళ మొహలు చూస్తే అర్ధమైపోతుంది ఎవరు గెలుస్తారో.

  

  జట్టు లో నాకు నచ్చిన ఆటగాళ్ళు ప్రవీణ్ కుమార్,రోస్ టేలర్. 

నాకు నచ్చిన జట్లు

రాజస్థాన్ రాయల్స్,చెన్నై సూపర్ స్టార్స్ .

వీటి గురించి మరోసారి సమయం అనుకూలిస్తే.

 

One Response

  1. హ్ డియర్ కిషోర్,

    మీ మొదటి బ్లాగ్ చాలా బాగా బ్లగేరు, చాలా బాగుంది. బ్లాగులొ మీరుచెప్పింది కరెక్ట్. మీరు ఇటువంటివి చాల రాయలని కొరుకుంటున్నను.

    మీ స్నేహుటుడు
    సీతారామరాజు

Leave a Reply